ఉదయనిధి స్టాలిన్, నయనతార సహజీవనం చేస్తున్నారు : రాధారవి

by సూర్య | Wed, Mar 31, 2021, 03:35 PM

డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్, సినీ నటి నయనతార గురించి ప్రముఖ తమిళ సినీ నటుడు 'రాధారవి' వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఈయన ఎప్పుడూ ఏదోఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు. నయనతారతో ఉదయనిధి స్టాలిన్ సహజీవనం చేస్తున్నాడని 'రాధారవి' అన్నారు. అయినా, ఇలాంటివి తాను పట్టించుకోనని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. డీఎంకే శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఉదయనిధి కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, కమలహాసన్ ను కూడా రాధారవి వదిలిపెట్టలేదు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి కామెంట్ చేశారు. ముగ్గురు భార్యలను కాపాడుకోలేకపోయిన కమల్... రాష్ట్రాన్ని ఏం కాపాడతారని ఆయన విమర్శించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాధారవి వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

Latest News
 
హనుమాన్ ఈవెంట్‌లో ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు Wed, Apr 24, 2024, 05:07 PM
త్వరలో విడుదల కానున్న 'బేబీ జాన్' టీజర్ Wed, Apr 24, 2024, 05:06 PM
ఈ వారం విడుదల కానున్న OTT సినిమాలు మరియు సిరీస్ Wed, Apr 24, 2024, 05:04 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ ప్రారంభం అప్పుడేనా? Wed, Apr 24, 2024, 04:38 PM
కొత్త చిత్రాన్ని ప్రకటించిన రాఘవ లారెన్స్ Wed, Apr 24, 2024, 04:36 PM