తన పెళ్లిపై కీర్తి సురేష్ ఆసక్తికర కామెంట్...!

by సూర్య | Wed, Mar 31, 2021, 03:32 PM

మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయిన కీర్తి సురేష్ వరుస ఛాన్స్ లను కొట్టేస్తూ కెరీర్ లో దూసుకుపోతోంది. తాజాగా ఈ అమ్మడు ‘రంగ్ దే’ సినిమాతో కీర్తి సురేష్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ మూవీ సక్సెస్ ప్రమోషన్స్ ను కొనసాగిస్తోంది చిత్ర బృందం. ఈ సందర్భంగా కీర్తి సురేష్ తన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లపై స్పందించిన ఆమె.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకే తెలియకుండా సోషల్ మీడియాలో పలు సార్లు పెళ్లి చేశారని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అయితే తనకు ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచన లేదని చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో ఓ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి చేసుకునే సమయం ఇంకా రాలేదని.. ఆ సమయం వస్తే మానవత్వం ఎక్కువగా ఉన్న వ్యక్తిని పెళ్లాడుతానని క్లారిటీ ఇచ్చింది.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM