లాంచనంగా విజయ్ 65 సినిమా పూజా కార్యక్రమం

by సూర్య | Wed, Mar 31, 2021, 03:05 PM

దళపతి విజయ్ నటించిన 'మాస్టర్' సినిమా తర్వాత తదుపరి సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి మాస్టర్ రిలీజై రెండు నెలలపైనే అవుతోంది. ఐతే దళపతి 65వ సినిమాగా తెరకెక్కనున్న తాజా మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్ మూవీకి ఈరోజే లాంచనంగా పూజా కార్యక్రమం చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి దళపతి విజయ్ తో పాటు సినిమా నిర్మాతలు డైరెక్టర్ టీమ్ అందరూ పాల్గొన్నారు. ప్రస్తుతం దళపతి65 పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దళపతి విజయ్ సరసన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జతకట్టబోతుంది. ఇటీవలే హీరోయిన్ గా పూజ పేరును అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మొత్తానికి మాస్టర్ విజయ్ త్వరలో పాన్ ఇండియా వైడ్ సందడి చేస్తాడని టాక్.  ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ ఫస్ట్ వారంలో షూటింగ్ ప్రారంభం అవుతుందని ఇండస్ట్రీవర్గాల సమాచారం.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM