`క్యూటీస్`అంటూ ఫోటో షేర్ చేసిన బన్ని

by సూర్య | Wed, Mar 31, 2021, 12:35 PM

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పర్ఫెక్ట్ `ఫ్యామిలీ మ్యాన్`గా అభిమానుల హృదయాల్లో నిలిచారు. భార్య స్నేహారెడ్డి.. వారసులు అయాన్.. అర్హలతో బన్ని నిరంతర సెలబ్రేషన్ గురించి.. ఆహ్లాదకరమైన ఆనందకరమైన లైఫ్ స్టైల్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇక బన్ని కుమార్తె అల్లు అర్హ అల్లరి వేషాల్ని పరిచయం చేయనవసరం లేదు. వీలున్న ప్రతిసారీ కుటుంబ సమేతంగా విహారయాత్రలను ఆస్వాధిస్తారు. ఫ్యామిలీ బ్రంచ్ లు కాఫీ డే పార్టీలు తెలిసిన వ్యవహారమే. ఇక అల్లు అర్హ అల్లరి వేషాల్ని .. భార్య స్నేహతో ఫోటోషూట్లను కూడా బన్ని ఇంతకుముందు షేర్ చేయగా అభిమానుల్లో వైరల్ అయ్యాయి. తాజాగా మరో క్యూట్ లవ్ లీ ఫోటోని బన్ని అభిమానుల కోసం ఇన్ స్టా మాధ్యమంగా షేర్ చేశారు. దానికి`క్యూటీస్`అంటూ సింపుల్ క్యాప్షన్ ఇచ్చారు. ఇంతకీ ఆ ఫోటోలో క్యూటీస్ ఎవరో చెప్పాలా? ఒకరు అల్లు అర్హ.. ఇంకొకరు అల్లు స్నేహ. బన్ని క్యాప్షన్ వందశాతం యాప్ట్ అని ఈ ఫోటో చూశాక అంగీకరించి తీరాల్సిందే. క్యూట్ మామ్ తో క్యూటీ అర్హ పిక్చర్ పర్ఫెక్ట్ ఫోజుతో ఆకట్టుకుంది. ప్రస్తుతం అభిమానులు ఈ ఫోటోని వైరల్ గా షేర్ చేస్తున్నారు.

Latest News
 
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM
నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం Fri, Mar 29, 2024, 12:00 PM