డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటుడు

by సూర్య | Wed, Mar 31, 2021, 12:07 PM

బాలీవుడ్ నటుడు 'అజాజ్ ఖాన్' సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎపుడు వార్తల్లో ఉంటాడు. గతేడాది లాక్ డౌన్ సందర్భంగా ఫేస్‌బుక్‌లో అభిమానులతో చాట్ చేస్తూ ఒక వర్గం  మనోభావాలను కించే పరిచే విధంగా అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంతో ముంబై పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసందే కదా. ఆ తర్వాత  బెయిల్ పై విడుదలయ్యాడు. ఆ సంఘటన మరవక ముందే ముంబై నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు. ఈయన ఓ షూటింగ్ నిమిత్తం మంగళవారం ముంబైకు చేరుకున్న అజాజ్ ఖాన్‌ను ముంబై ఎయిర్ పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఓ డ్రగ్స్ కేసులో అజాజ్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్‌సీబీ అధికారి తెలిపారు.


రాజస్తాన్‌ నుంచి మంగళవారం ముంబైకు చేరిన ఖాన్‌ను ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మాదక ద్రవ్యాల కేసులో పెడ్లర్ షాదాబ్ బటాటాను ప్రశ్నించినపుడు ఖాన్ పేరును బయటపెట్టాడు. దీంతో పోలీసులు అజాజ్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అజాజ్ ఖాన్ తనను పోలీసులు ఎవరు అదుపులోకి తీసుకోలేదని చెప్పుకొచ్చాడు. ఓ కేసు నిమిత్తం అధికారులను కలవడానికి వచ్చానని చెప్పుకొచ్చాడు. అజాజ్ ఖాన్ అరెస్ట్ కావడం ఇదే మొదటి సారి కాదు.  ఇప్పటికే ఆయన పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు, మూడు సార్లు అరెస్ట్ అయ్యారు. అంతకు ముందు మాదక ద్రవ్యాలు కలిగిన కేసులో ఓసారి ఇలాగే పోలీసులకు పట్టుపడ్డాడు. అజాజ్ ఖాన్ తెలుగులో ‘దూకుడు’, ‘నాయక్’, ‘బాద్‌షా’ వంటి సినిమాల్లో తెలుగు ఆడియన్స్‌కు సుపరిచితుడే.  ఎపుడు ఏదో వివాదంలో మునిగితేలే..ఆజాజ్ ఖాన్ హిందీ బిగ్‌బాస్ షోతో పాపులర్ అయ్యాడు.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM