బాయ్ ఫ్రెండ్ కి బర్త్ డే విషెస్ చెప్పిన శ్రుతీ హాసన్

by సూర్య | Wed, Mar 31, 2021, 11:52 AM

న‌టి శ్రుతీ హాస‌న్ మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ్డారు. ప్ర‌ముఖ ఆర్టిస్ట్ 'సంతాను హ‌జారిక'‌ తో ఆమె ప్రేమ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై ఈ ఇద్ద‌రు స్ప‌ష్ట‌త‌ను ఇవ్వ‌న‌ప్ప‌టికీ.. వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో పుకార్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఆ మ‌ధ్య‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన సంతాను.. వృత్తిప‌రంగా తాము మంచి స్నేహితుల‌మ‌ని, తామిద్ద‌రికి ప‌లు అభిప్రాయాలు క‌లిశాయ‌ని, వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై తాను మాట్లాడుకోవాల‌నుకోవ‌డం లేద‌ని అన్నాడు. అయితే బ‌య‌ట‌కు అలా చెప్పిన‌ప్ప‌టికీ.. సంతాను, శ్రుతీతో డీప్ ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు టాక్. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రు త‌ర‌చుగా క‌లుస్తున్నారు. సంతాను కోసం శ్రుతీ ముంబ‌యికి వెళుతూ వ‌స్తుండ‌గా.. శ్రుతీ, సంతాను కోసం చెన్నై వ‌స్తున్నాడు. ఇదిలా ఉంటే ఇవాళ సంతాను పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో స్పెష‌ల్ విషెస్ చెప్పింది శ్రుతీ. సంతాను ఫొటోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేసి హ్యాపీ బ‌ర్త్ టు దిస్ ఇన్‌క్రెడిబుల్ హ్యూమ‌న్ అని శ్రుతీ కామెంట్ పెట్టింది. ఇక ఇన్‌స్టా రీల్‌లోనూ అత‌డి ప‌లు ఫొటోల‌ను షేర్ చేసింది శ్రుతీ.

Latest News
 
సెన్సార్ పూర్తి చేసుకున్న 'కలియుగం పట్టణంలో' Thu, Mar 28, 2024, 05:29 PM
ఓపెన్ అయ్యిన 'ఫ్యామిలీ స్టార్' ఓవర్సీస్ బుకింగ్స్ Thu, Mar 28, 2024, 05:28 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గేమ్ ఛేంజర్' లోని జరగండి సాంగ్ Thu, Mar 28, 2024, 05:10 PM
'ఓం భీమ్ బుష్‌' 6 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Thu, Mar 28, 2024, 05:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్' Thu, Mar 28, 2024, 05:02 PM