‘వకీల్‌సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి ఇవ్వలేమన్న పోలీసులు..నిరాశ లో ఫ్యాన్స్

by సూర్య | Wed, Mar 31, 2021, 11:15 AM

పవన్ అభిమానులకు  నిరాశ ఎదురయింది. రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ‘వకీల్‌సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు. జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖరరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. యూసుఫ్‌గూడలోని పోలీస్ లైన్స్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 3న పవన్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని ప్లాన్ చేశారు. దీనికి అనుమతి కోరుతూ జె.మీడియా పోలీసులకు లేఖ రాసింది. ఈ ఫంక్షన్‌కు 5 నుంచి 6 వేల మంది హాజరవుతారని ఆ లేఖలో నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే, రాష్ట్రంలో కరోనా మళ్లీ చెలరేగుతున్న నేపథ్యంలో సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ‘వకీల్‌సాబ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పవన్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM