శంకర్ 'ఒకే ఒక్కడు' సీక్వెల్ లో ఆ మెగా హీరో

by సూర్య | Wed, Mar 31, 2021, 11:01 AM

చరణ్ 15 వసినిమా ను డైరెక్టర్ శంకర్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా కనిపిస్తారని.. ఆ తర్వాత  అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడానికి రాజకీయ వ్యవస్థను పునరుద్ధరించే బాధ్యతను తీసుకునే యువ ముఖ్యమంత్రి అవుతారని తెలుస్తోంది. కాన్సెప్ట్ వింటుంటేనే రోమాలు నిక్కబొడిచే విధంగా ఉంది. అయితే ఇంతకుముందు యువ ముఖ్యమంత్రి కాన్సెప్ట్ తో చాలా సినిమాలొచ్చాయి. విజయ్ దేవరకొండ నటించిన నోటా ఈ తరహానే. కానీ అవన్నీ జూనియర్ దర్శకుల సినిమాలు. ఇప్పుడు సీనియర్ అయిన ది గ్రేట్ శంకర్ విజన్ నుంచి పుట్టుకొచ్చిన కథతో తెరకెక్కుతోంది. ఇక విజువల్ గ్రాండియారిటీ పరంగా కానీ.. సామాజిక రాజకీయాంశాల్ని టచ్ చేసే వైనం కానీ ఓ లెవల్లోనే తెరపై పండుతాయనడంలో ఎలాంటి సందేమం లేదు. ఇక గల్లీలో డప్పు కొట్టి అమ్మోరి ముందు డ్యాన్సులాడే మాస్ జనానికి కూడా కనెక్టయ్యేలా.. పల్లె పల్లెనా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ఆసక్తికర సన్నివేశాలతో ఇలాంటి సినిమాల్ని మలచడంలోనూ శంకర్ గత నైపుణ్యం గురించి చెప్పాల్సిన పనే లేదు. అందుకే ఇప్పుడు చరణ్ ని సీఎంగా చూపిస్తారంటేనే ఆసక్తి నెలకొంది. ఇంతకుముందు యాక్షన్ కింగ్ అర్జున్ కథానాయకుడిగా నటించిన ఒకే ఒక్కడు ఈ సందర్భంగా స్ఫురణకు వస్తుంది. నిజానికి చరణ్ కుటుంబ  రాజకీయం నేపథ్యంలో ఉంది. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అవ్వాలన్న కసితో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రస్తుత కుతంత్రాల రాజకీయ వ్యవస్థను ఢీకొట్టడంలో విఫలమయ్యారు. ముఖ్యమంత్రి కలలు నెరవేరలేదు. కనీసం తనయుడిని సీఎంగా తెరపై చూసుకునే అవకాశం చిరుకి కలుగుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తాయనడంలో సందేహమేం లేదు. జనసేన పార్టీని స్థాపించి పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉండడంతో శంకర్ - రామ్ చరణ్ ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో పెద్ద డిబేట్ కి తెర తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు సినీ ప్రముఖులు. 

Latest News
 
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM
రేపే 'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదల Thu, Apr 25, 2024, 04:14 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్ Thu, Apr 25, 2024, 04:09 PM
'బేబీ జాన్' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Thu, Apr 25, 2024, 04:04 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్న 'రత్నం' Thu, Apr 25, 2024, 04:02 PM