నాగ్ సార్ అంటే నాకు చిన్నప్పటినుండి చాలా ఇష్టం : దియా మీర్జా

by సూర్య | Wed, Mar 31, 2021, 08:52 AM

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'వైల్డ్ డాగ్' చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌ను చిత్రయూనిట్‌ వేగవంతం చేసింది. వరుస ప్రెస్‌ మీట్స్‌తో ప్రేక్షకులు ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడంలో చిత్రయూనిట్‌ సక్సెస్‌ అవుతుంది. 'వైల్డ్‌ డాగ్‌' చిత్రాన్ని అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ సినిమాలో నాగ్‌ జోడీగా నటించిన బాలీవుడ్ భామ దియా మీర్జా.. మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ..


''నేను ముంబైలో ఉన్నప్పుడు దర్శకుడు సాల్మన్ ఫోన్ చేసి ముందు ఈ క్యారెక్టర్ గురించి చెప్పాడు. తర్వాత స్ర్కిప్ట్ నాకు పంపాడు. స్ర్కిప్ట్ నచ్చింది. మాములుగా నేను ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఓకే చేయడానికి మూడు విషయాలు పరిగణలోకి తీసుకుంటాను. ముందుగా ఆ సినిమా ఏ భాషలో రూపొందుతోంది. రెండవది దర్శకుడి ఎనర్జి, మూడవది టీమ్‌. ఈ మూడు విషయాలు నాకు నచ్చడంతో 'వైల్డ్‌ డాగ్' ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పాను.


 


నాగ్ సార్ అంటే నాకు చిన్నప్పటినుండి చాలా ఇష్టం. ఆయన సిస్టర్ మా పేరెంట్స్‌కి వెరీ గుడ్ ఫ్రెండ్. నేను చిన్నప్పుడు సుప్రియ బొమ్మలతోనే ఎక్కువ ఆడుకునేదాన్ని. మా అమ్మగారు నాగ్‌ సర్ గురించి ఎప్పుడూ చెబుతుండేవారు. ఈ సినిమా కోసం మేము ఎలాంటి వర్క్ షాప్స్ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైమ్ నాగ్‌సర్‌తో వర్క్‌చేయబోతున్నాను అనగానే చాలా భయం వేసింది. 20 సంవత్సరాల తర్వాత నాగార్జున గారిని కలిశాను. ఈ సినిమాలో నేను నాగ్‌సర్ వైఫ్‌గా కనిపిస్తాను. ఆయనతో కలిసి మొదటి సన్నివేశం చేసేటప్పుడు చాలా నెర్వస్ ఫీలయ్యాను. కాని నాగ్‌ సర్ సింపుల్‌, గ్రౌండెడ్‌, నైస్ హ్యూమన్ బీయింగ్‌. చాలా సపోర్ట్ చేశారు. షూటింగ్ చాలా బాగా జరిగింది.ఎవ్‌రీ యాక్షన్ ఫిలిం నీడ్స్ ఏ హార్ట్‌. అందులోనూ మన దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనకాడని అన్‌సంగ్ హీరోస్ గురించి ప్రస్తావిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగానే దర్శకుడు సాల్మన్‌గారు ఈ స్క్రిప్ట్‌ను ఎంతో రీసెర్చ్ చేసి రెడీ చేశారు. ఇలాంటి ఒక మంచి సినిమాలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పాత్రతో పాటు సయామి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. నా క్యారెక్టర్ గురించి ఇప్పుడే ఎక్కువ చెప్పలేను కానీ.. రేపే థియేటర్స్‌లో సినిమా చూస్తున్నప్పుడు మీకు తప్పకుండా నచ్చుతుంది. నా పాత్ర కథలో ఒక భాగంగా ఉంటుంది కాబట్టి స్ర్కీన్ డ్యూరేషన్ గురించి ఆలోచించలేదు.


మంచి కథలు వస్తే తెలుగులో నటించడానికి సిద్దంగా ఉన్నాను. వైల్డ్‌ డాగ్ సినిమాతో తెలుగులో నాకు మరిన్ని అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి నాగ్‌ సర్‌, వెంకటేష్ సర్‌తో వర్క్ చేయాలనే డ్రీమ్‌ ఉంది. వైల్డ్‌ డాగ్ చిత్రంలో హాఫ్ ఆఫ్ మై డ్రీమ్ నెరవేరింది. త్వరలోనే ఫుల్‌ డ్రీమ్‌ నెరవేరుతుందని ఆశిస్తున్నాను.." అని తెలిపింది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM