కరీనా కపూర్ డైట్ సీక్రెట్స్ ఇవే

by సూర్య | Sun, Mar 28, 2021, 10:42 AM

ఫిట్నెస్, గ్లామర్ విషయంలో హీరోయిన్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తమ శరీరాకృతిని మైంటైన్ చేయడం కోసం సరైన డైట్ ని ఫాలో అవుతుంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం రోజుకి ఎనిమిది సార్లు తింటుందట. అలా తింటూనే స్లిమ్ బాడీను మైంటైన్ చేస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్. నలభై ఏళ్ల ఈ బ్యూటీ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. కానీ ఇప్పటికీ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా కరీనా డైట్ ఏంటనే విషయాన్ని ఆమె న్యూట్రిషనిస్ట్ బయటపెట్టారు.


మితంగా ఎక్కువసార్లు తినడం, రెగ్యులర్ గా వ్యాయామాలు చేయడం కరీనా కపూర్ సీక్రెట్ అని చెప్పుకొచ్చారు. లేచిన వెంటనే.. కుంకుమ పువ్వుతో కలిపిన నల్లటి ఎండుద్రాక్షను తింటుంది కరీనా. ఆ తరువాత బ్రేక్ ఫాస్ట్ లో పరాఠా-చట్నీ తింటుంది. లంచ్ కి ముందు కొన్ని సబ్జా గింజలు తిని కొబ్బరినీళ్లు తాగుతుంది. ఇక మధ్యాహ్నం భోజనం కింద కేవలం పెరుగన్నం, అప్పడం తింటుంది. ఆ తరువాత కొంచెం గ్యాప్ ఇచ్చి వాల్ నట్స్, చీజ్ తీసుకుంటుంది.సాయంత్రం బనానా మిల్క్ షేక్ తాగుతుంది. ఇక రాత్రికి డిన్నర్ లో వెజ్ పులావ్ తో పాటు కంద, పెరుగు తింటుంది. పడుకునే ముందు పాలు లేదా బనానా మిల్క్ షేక్ తాగుతుంది. ఇలా రోజులో ఎనిమిది సార్లు ఆహరం తీసుకుంటూ.. ఎక్సర్ సైజ్ చేయడం వలన కరీనా మంచి ఫిజిక్ ను మైంటైన్ చేయగలుగుతుంది. వారానికి పది గంటలు వ్యాయామాలు, అంతే సమయం యోగా చేస్తూ తన ఫిట్నెస్ ను కాపాడుకుంటుంది.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM