‘వకీల్ సాబ్’లో ముఖ్యమైన పనులు పూర్తి చేసిన పవన్

by సూర్య | Sat, Mar 27, 2021, 01:56 PM

 శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్ సాబ్’. మహిళ ఇతివృత్తంతో ఈ సినిమాను సందేశాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా బాలీవుడ్‌లో  బ్లాక్ బస్టర్  ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. అక్కడ అమితాబ్ బచ్చన్  చేసిన ఆ లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అయితే  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఏ విషయమైన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్... తాజాగా ఈ సినిమాకు అత్యంత ముఖ్యమైన  డబ్బింగ్ పనులను పూర్తి చేసాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించారు.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన మూడోసారి శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక విడుదలకు దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చిత్రబృందం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సత్యదేవ్ అనే వకీల్ పాత్రలో నటిస్తున్నాడు.

Latest News
 
'ది 100' టీజర్ ని విడుదల చేయనున్న మెగా మదర్ Thu, Apr 25, 2024, 08:35 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'రత్నం' Thu, Apr 25, 2024, 08:28 PM
'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Apr 25, 2024, 08:27 PM
రేపే 'టిల్లు స్క్వేర్' డిజిటల్ అరంగేట్రం Thu, Apr 25, 2024, 08:23 PM
రేపు రివీల్ కానున్న 'ఒదెల 2' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 25, 2024, 08:21 PM