రవితో కలిసి స్టేజ్ పై..

by సూర్య | Sat, Mar 27, 2021, 08:59 AM

 బుల్లితెరపై యాంకర్లుగా రాణించిన వారు చాలా మందే ఉన్నారు. వీరిలో లాస్య మంజునాథ్ ఒకరు. ఒకప్పుడు బుల్లితెర బెస్ట్ జోడీగా ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేర్లు యాంకర్ రవి- లాస్య. ఈ ఇద్దరు కలిసి చాలా సందడిగా టీవీ షోలను నడిపించేవారు. యాంకర్ గా రాణిస్తున్న సమయంలోనే లాస్య పెళ్లిచేసుకుంది. ఆ కొంతకాలం తర్వాత యాంకరింగ్ కు దూరమయ్యింది. ఇటీవల నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది లాస్య. బిగ్ బాస్ హౌస్ లో తనదైన మాటలతో, అల్లరితో ఆకట్టుకుంది ఈ భామ.


ఇక ఇప్పుడు మరోసారి యాంకర్ గా రీఎంట్రీ ఇచ్చింది. స్టార్ మా నిర్వహిస్తున్న కామెడీ స్టార్స్ అనే షోకు యాంకర్ గా వ్యవహరిస్తోంది లాస్య. చాలా కాలం తర్వాత రవితో కలిసి స్టేజ్ పై సందడి చేస్తుంది లాస్య. హోలీ స్పెషల్ గా స్టార్ మా ‘కామెడీ స్టార్స్’ షో నుంచి ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రమోలు మరోసారి తన కామెడీ తో ఆకట్టుకుంది లాస్య. రవితో కలిసి ఓ కామెడీ స్కిట్ చేసింది లాస్య. ఈ స్కిట్ లో తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించింది. ఇప్పుడు ఈ ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM