రాముడిగా ప్రభాస్ లుక్ ను రివీల్ చేసేది అప్పుడేనా...?

by సూర్య | Thu, Mar 25, 2021, 04:06 PM

ఓం రౌత్ దర్శకత్వంలో  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా కోసం సన్నబడి కొత్త లుక్ ట్రై చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు.  ఇందులో కృతి సనన్ కథానాయకిగా చేస్తుండగా లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు.  ప్రభాస్ చేస్తున్న డైరెక్ట్ హిందీ చిత్రం ఇదే కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అసలు ప్రభాస్ రాముడి గెటప్లో ఎలా ఉంటారో చూడాలని తెగ ఉబలాటపడుతున్నారు. ఇప్పటివరకు ఏదో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు చూడటమే తప్ప అసలు లుక్ చూడలేదు. షూటింగ్ స్పాట్ నుండి పిక్స్ కూడ బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. దీంతో రాముడి అవతారంలో తమ హీరోను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. అది కూడ ఏప్రిల్ 21న శ్రీరామనవమి పర్వదినం రోజున చేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఎందులో ఎంత నిజం ఉందొ...?

Latest News
 
'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Apr 25, 2024, 03:27 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Apr 25, 2024, 03:25 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Thu, Apr 25, 2024, 03:21 PM
'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగల్ రిలీజ్ అప్పుడేనా? Thu, Apr 25, 2024, 03:18 PM
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న 'కృష్ణమ్మ' టీమ్ Thu, Apr 25, 2024, 03:13 PM