'గంగూభామ్ కతియావాడి' టీంకు ఎదురు దెబ్బ..ముంబై కోర్టు సమన్లు జారీ..!

by సూర్య | Thu, Mar 25, 2021, 12:31 PM

సంజయ్ లీలా భన్సాలీ గంగూభామ్ కతియావాడి అనే పేరుతో సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తుంది. చిత్రంలో అలియా భట్ ప్రధాన పాత్ర పోషించగా, గంగూభాయ్ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ఒదిగిపోయింది. మరి కొద్ది రోజులలో చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తుండగా, టీంకు ఎదురు దెబ్బ తగిలింది. అలియా భట్‌, సంజయ్ లీలా భన్సాలీ కు ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. ఆలియా, సంజయ్‌ను మే 21న గానీ అంతకంటే ముందుగానీ కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. తన తల్లి ప్రతిష్టను కించపరిచే విధంగా, ఆమె జీవితానికి సంబంధించిన విషయాలను అగౌరవ పరిచే విధంగా గంగుభాయ్ కతియావాడి చిత్రం ఉందనే ఆరోపణలతో ఆమె కుమారుడు బాబురావు షా ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకొని కోర్టు సమన్లు జారీ చేసింది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM