by సూర్య | Thu, Mar 25, 2021, 11:59 AM
తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో తెరకెక్కిన ఆయన సినిమాలో తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఆవారా, నా పేరు శివ, ఖాకీ, ఊపిరి, ఖైదీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కార్తీ. ప్రస్తుతం కార్తీ ‘సుల్తాన్’ సినిమా చేస్తున్నాడు. ఇందులో కార్తీకి జోడీగా రష్మిక మందన నటిస్తుంది. రెమో ఫేం భ్యాగ్యరాజ్ కన్నన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్.