సరికొత్త గెటప్‌లో వ‌రుణ్ తేజ్

by సూర్య | Tue, Jan 19, 2021, 11:03 AM

ముకుంద' సినిమాతో  వెండితెర ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం వైవిధ్య‌మైన క‌థ‌లను ఎంపిక చేసుకుంటూ మంచి విజ‌యాలు అందుకుంటున్నాడు. ఈ మ‌ధ్య కాలంలో  ఎఫ్ 2, గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ చిత్రాల‌తో భారీ విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్ ప్ర‌స్తుతం బాక్సింగ్ నేప‌థ్యంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని  న్యూ డైరెక్టర్ కిరణ్‌ కొర్రపాటి  తెర‌కెక్కిస్తున్నారు. 


ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ బాక్సర్‌గా సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుణ్ కెరీర్‌లో 10వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీని అల్లు అరవింద్‌ సమర్పణలో రెనసాన్స్‌ ఫిలింస్‌, బ్లూ వాటర్‌ క్రియేటివ్‌ బ్యానర్స్‌పై అల్లు వెంకటేశ్‌‌, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు.  ఈ రోజు వ‌రుణ్ తేజ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా  మూవీ ఫ‌స్ట్ లుక్‌తో పాటు మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఇందులో వ‌రుణ్ లుక్ మూవీపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది. గ‌ని అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం  వరుణ్‌తేజ్‌ ప్రత్యేకంగా అమెరికాలో శిక్షణ పొందారు.


 


 


 


 





Latest News
 
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM
రేపే 'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదల Thu, Apr 25, 2024, 04:14 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్ Thu, Apr 25, 2024, 04:09 PM
'బేబీ జాన్' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Thu, Apr 25, 2024, 04:04 PM