విజయ్‌ దేవరకొండకు అభిమానులు బీరాభిషేకం..

by సూర్య | Mon, Jan 18, 2021, 03:14 PM

టాలీవుడ్‌లో లైగర్ రచ్చ అప్పుడే మొదయింది. ఫస్ట్ లుక్ వచ్చిన రోజే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న మూవీ ఫస్ట్ లుక్‌ విడుదలైన విషయం తెలిసిందే. లైగర్ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ లుక్‌ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందంటే ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు. పోస్టర్‌లకు పాలాభిషేకం చేస్తారు. పూలదండలు వేసి కొబ్బరి కాయలు కొడతారు. హీరో ఫొటో నుదుట రక్తపు తిలకం దిద్దుతారు. కానీ విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ లుక్ విడుదల రోజే రచ్చ రచ్చ చేస్తున్నారు. పాలాభిషేకం కాదు ఏకంగా బీరాభిషేకం చేశారు రౌడీ అభిమానులు. లైగర్ పోస్టర్‌కు ఇద్దరు అభిమానులు బీర్‌తో అభిషేకం చేస్తున్న వీడియోను నటి, లైగర్ మూవీ నిర్మాత ఛార్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM