చైతూ ఫోటోపై సమంత కామెంట్..

by సూర్య | Mon, Jan 18, 2021, 02:07 PM

టాలీవుడ్‌లో మోస్ట్ ఫేమస్ కపుల్స్‌లో అక్కినేని నాగ చైతన్య, సమంత జంట ఒకటి. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన 'ఏమాయ చేశావే' సినిమా సమయంలో ప్రేమలో పడిన ఈ ఇద్దరూ.. అప్పటి నుంచి తమ బంధాన్ని కొనసాగించారు. కొన్నేళ్ల క్రితం ఈ జంట అగ్నిసాక్షిగా ఒక్కటైంది. వివాహం తర్వాత కూడా వీళ్లిద్దరి కెరీర్‌లో ఏమాత్రం మార్పు లేకుండా ముందుకెళ్తున్నారు.
తాజాగా నాగ చైతన్య ఫోటోకి సమంత చేసిన ఓ చిలిపి కామెంట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. నాగ చైతన్య తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వం లో 'థాంక్యూ' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ కూడా భాగమయ్యారు.
విక్రమ్ గత సినిమాలన్నిటికీ పిసి శ్రీరామ్ పనిచేసిన విషయం తెలిసిందే. అందుకే వీరి అంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మనసుకు హత్తుకునే దృశ్యాలతో ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏదో ఒక మూల కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న చై ను పీసీ శ్రీరామ్ తన కెమెరాలో బంధించారు.
ఈ పిక్ ను చై షేర్ చేస్తూ ఆయనలాంటి వ్యక్తితో పని చేయడం గర్వంగా అందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు. అయితే ఈ పిక్ పై సమంత కూడా స్పందించింది. కానీ ఆమె తనదైన స్టైల్ లో ఓ చిలిపి కామెంట్ ను జోడించింది. "అరే.. నా గురించే ఆలోచిస్తున్నావా?" అంటూ సామ్ చేసిన కామెంట్ వైరల్ గా మారింది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM