క్షమాపణలు చెప్పిన హీరో విజయ్ సేతుపతి

by సూర్య | Sun, Jan 17, 2021, 11:53 AM

బర్త్ డే రోజున తమిళ నటుడు విజయ్ సేతుపతి బహిరంగ క్షమాపణలు చెప్పాడు. తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన విధానానికి సంబంధించి క్షమాపణ కోరాడు. వివరాల్లోకి వెళ్తే..ఇటీవల విజయ్ సేతుపతి బర్త్ డే సందర్భంగా సెట్లో వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా పెద్ద ఖడ్గంతో కేక్ ను కట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సేతుపతిపై పలువురు విమర్శలు గుప్పించారు.
గతంలో కొందరు సంఘ విద్రోహశక్తులు ఇలాగే చేసినందుకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారని... సేతుపతికి ఇది వర్తించదా? అంటూ ప్రశ్నలు వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రంలో ఖడ్గం కీలక పాత్రను పోషిస్తుందని... అందుకే తన చిత్ర బృందం తనతో కేక్ ను అలా కట్ చేయించిందని చెప్పాడు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని తెలిపాడు. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించాలని హీరో విజయ్ సేతుపతి కోరాడు.

Latest News
 
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM
విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ డీటైల్స్ ఇవే! Fri, Mar 29, 2024, 10:15 AM
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM