నా భర్త దృష్టిలో నేనే సూపర్ స్టార్

by సూర్య | Sun, Jan 17, 2021, 10:25 AM

నాకిచ్చిన పాత్ర ఏదైనా సిన్సియర్ గా చేస్తాను. ‘నేను’ మూవీ తో కెరీర్ స్టార్ట్ చేసిన నాకు చాలా మంచి పాత్రలు వచ్చాయి. శ్రీరామదాసులో సీత పాత్రతో మరింత పేరు వచ్చిందని తెలిపింది నటి అర్చన. నా వర్కింగ్ స్టైల్ అంటూ నాకుంటుంది. ఒక పాత్రకే పరిమితమయ్యేలా చూసుకోను. నాకు డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. స్పెషల్ సాంగ్స్ చేయడం, గ్లామర్ రోల్స్ చేయడం వల్ల ఆఫర్స్ తగ్గుతాయని నేను అనుకోను. పెళ్లి తర్వాత హ్యాపీ గా ఉన్నాం. నా భర్త దృష్టిలో నేనే సూపర్ స్టార్. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నాను. కెమెరామెన్ అంజి డైరెక్షన్ లో ఈరోజే ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేశాను. చాలా ఇంటరెస్టింగ్ రోల్ లో నటిస్తున్నాను అని చెప్పింది‌. తాజాగా ఆమె న‌టించిన సినిమా ”అన్నపూర్ణమ్మ గారి మనవడు”. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.


స్వచ్ఛమైన పల్లెటూరి కథతో ఉమ్మడి కుటుంబాలలో వున్న అనుబంధాలను, మానవ సంబంధాలను సమ్మిళతం చేసి తెరకెక్కించిన చిత్రమే ఇది.

Latest News
 
విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ' Wed, Apr 17, 2024, 08:37 PM
3M దిశగా దూసుకుపోతున్న 'టిల్లూ స్క్వేర్' Wed, Apr 17, 2024, 08:36 PM
'సికందర్‌' ఆన్ బోర్డులో ప్రీతమ్? Wed, Apr 17, 2024, 08:34 PM
బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్ Wed, Apr 17, 2024, 08:32 PM
'విశ్వంభర' కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ Wed, Apr 17, 2024, 08:30 PM