షాకింగ్ న్యూస్ చెప్పిన 'బిగ్ బాస్' బ్యూటీ!

by సూర్య | Sat, Jan 16, 2021, 05:35 PM

‘కలవాని’ చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు దగ్గరైన నటి ఓవియా హెలెన్‌. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో దాదాపు 40 సినిమాల్లో నటించిన ఈమె.. తమిళ బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని భారీ క్రేజ్ కొట్టేసింది. అయితే ఆ సీజన్ విన్నర్‌ ఆరవ్‌తో బిగ్ బాస్ హౌస్‌లో ఆమె చేసిన రొమాన్స్, జరిపిన ప్రేమాయణం, ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం అప్పట్లో తీవ్ర సంచలనం రేపాయి. బిగ్ బాస్‌లో పాల్గొని పాపులారిటీ పెంచుకున్న ఓ సినీ నటి తనకు లవర్ లేదనే చెబుతూ వస్తోంది. అయితే తాజాగా ఆమె ఓ షాకింగ్ న్యూస్ ను షేర్ చేశారు. నా స్టేటస్ సింగిల్ అని చెవుతున్న ఓవియా సడన్ గా ఓ సోషల్ మీడియా పోస్ట్ తో షాక్ ఇచ్చింది. ఆమె ఓ వ్యక్తిని కిస్ చేస్తున్న ఫోటో వైరల్ అయ్యింది. ఆ ఫోటోకు ఆమె లవ్ యూ అంటూ ట్యాగ్ పెట్టడం అందులోనూ ఫోటోలో ఉన్న వ్యక్తిని కిస్ చేయడం వంటివి వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఫోటోలోని వ్యక్తి ఎవరో చెప్పాలంటూ అభ్యర్థిస్తున్నారు.

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM