'జాంబీరెడ్డి' సినిమా నుంచి 'గో కరోనా' పాట విడుదల..!

by సూర్య | Sat, Jan 16, 2021, 12:15 PM

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం 'జాంబీ రెడ్డి'. భారతదేశపు తొలి జాంబి మూవీగా వస్తున్న ఈ చిత్రంతో బాలనటుడిగా పేరు తెచ్చుకున్న తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో ఆనంది - దక్ష నగార్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన చిత్ర యూనిట్.. ఇప్పటికే 'జాంబీ రెడ్డి' ఫస్ట్ బైట్ - బిగ్ బైట్ తో సినిమాపై అంచనాలు కలిగించారు. ఈ క్రమంలో తాజాగా చిత్రంలోని 'గో కరోనా' సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.'ఇంట్లోనే ఉండమంటే ఊరుకుంటమా.. రోడ్లన్నీ ఖాళీగా ఉంటే రాక ఉంటమా.. ఎవడెన్ని చెప్తా ఉన్నా మేము వింటమా.. మా వీపు పగిలే వరకు మానుకుంటమా' అంటూ సాగిన ఈ పాటకు మార్క్ కె రాబిన్ ట్యూన్ ఇచ్చారు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో జరిగిన ఇన్సిడెంట్స్ తో ఈ 'గో కరోనా' సాంగ్ ఉండనుంది. చప్పట్లు కొట్టమంటే డప్పులు కొట్టామని.. దీపాలు వెలిగించమంటే క్రాకర్స్ కాల్చారని.. వైరస్ ని లెక్కచేయకుండా వైన్ షాపుల ముందు బారులు తీరారని.. ఇలా అన్ని విషయాలను ఇందులో ప్రస్తావించారు. దీనికి మామా సింగ్ లిరిక్స్ అందించదంతో పాటు ర్యాప్ పాడారు. ఈ పాటను అనుదీప్ - శ్రీకృష్ణ - మార్క్ కె రాబిన్ కలిసి ఆలపించారు. మొత్తం మీద గో కరోనా సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.
'జాంబీ రెడ్డి' చిత్రానికి స్క్రిప్ట్స్ విల్లే స్క్రీన్ ప్లే అందించగా.. అనిత్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. సాయిబాబు ఎడిటింగ్ వర్క్ చేశారు. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రఘుబాబు - పృథ్వీరాజ్ - జబర్దస్త్ శ్రీను - హేమంత్ - హరితేజ - అన్నపూర్ణమ్మ - కిరీటి - రమరఘు కీలక పాత్రలు పోషించారు. ఇండియాలో జాంబీల కాన్సెప్ట్ తో వస్తున్న ఫస్ట్ సినిమా 'జాంబీ రెడ్డి' ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM