'రెడ్' తొలి రోజు షేర్ ఎంతంటే..?

by సూర్య | Fri, Jan 15, 2021, 04:38 PM

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన 'రెడ్' చిత్రం సూపర్‌హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. తొలి రోజు థియేటర్లు ఆడియెన్స్ తో నిండిపోయాయి. రెడ్ మూవీకి ఏ రేంజ్ లో టాక్ నడుస్తోందో..తొలి రోజు బాక్సాపీస్ కలక్షన్లను చూస్తే అర్థమవుతుంది. తాజా సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు రెడ్ రూ. 6.70 కోట్లు షేర్ రాబట్టింది. నైజాంలో రూ.2.19 కోట్లు, సీడెడ్ లో రూ.1.17 కోట్లు, నెల్లూరు రూ.36 లక్షలు, గుంటూరు రూ.46.5 లక్షలు, కృష్ణా రూ.35.3 లక్షలు, పశ్చిమగోదావరి రూ.95.7 లక్షలు, తూర్పు గోదావరి రూ. 63.85 లక్షలు, ఉత్తరాంధ్ర రూ.53 లక్షలు వసూళ్లను రాబట్టింది.
'రెడ్' చిత్రాన్ని బ్లాక్ బాస్టర్ హిట్ గా చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఫేస్ మాస్కు పెట్టుకుని సినిమాను ఎంజాయ్ చేయండి..ప్రేమతో అంటూ ట్వీట్ చేశాడు రామ్‌. కిశోర్ తిరుమల-రామ్ కాంబినేషన్ లో మూడోసారి వచ్చిన చిత్రం రెడ్‌. ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్టు కొట్టాడు రామ్‌.

Latest News
 
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM