బిగ్‌బాస్ 4 విన్నర్‌ అభిజిత్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్..పంపిందెవరో తెలుసా..?

by సూర్య | Fri, Jan 15, 2021, 02:07 PM

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 విజేత అభిజిత్‌కు టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. బిగ్‌బాస్‌లో గెలిచినందుకు రోహిత్‌ స్వయంగా ఫోన్‌ చేసి అభినందనలు తెలిపాడు. అంతేకాదు తన జెర్సీపై 'విత్‌ లవ్‌ అండ్‌ బెస్ట్‌ విషెస్‌' అని రాసి తన సంతకం చేసి అభిజిత్‌కు పంపించాడు. ఈ విషయాన్ని అభిజిత్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు తన గురించి రోహిత్‌ శర్మకు చెప్పిన హైదరాబాద్‌ క్రికెటర్‌ హనుమ విహారికి అభిజిత్‌ ధన్యవాదాలు తెలిపాడు. తీవ్ర ఒత్తిడిలో కూడా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నావని కితాబిచ్చాడు. తాను ఎంతగానో అభిమానించే రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేస్తుంటే.. అన్ని పనులను ఆపేసి క్రికెట్‌ చూస్తూ ఉండిపోతానని అభిజిత్‌ చెప్పాడు. క్రికెటర్‌ కావాలనేది చిన్నప్పటి నుంచి తన కోరిక అని తెలిపాడు. అయితే, అది జరగలేదని, జీవితం మరో కోణంలో పయనించిందని చెప్పాడు. ఇక రోహిత్‌ శర్మ తల్లి పూర్ణిమా శర్మది విశాఖపట్నం అన్న విషయం తెలిసిందే.
రోహిత్‌ శర్మ మహారాష్ట్రలో పుట్టి పెరిగినప్పటికీ తెలుగు మూలాల కారణంగా అతడికి తెలుగు అర్థం అవుతుంది. మరోవైపు తెలుగు తేజం హనుమ విహారి టీమిండియాలో ఆడుతుండటంతో రోహిత్‌, విహారి మధ్య తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చ వచ్చిందట. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ గురించి కూడా చర్చించుకున్నారు. దీంతో, బిగ్‌బాస్‌ విన్నర్‌ అభిజిత్‌కు రోహిత్‌ బహుమతి అందించాడు. ఈ విషయాన్ని అభిజిత్‌ స్వయంగా వెల్లడించాడు. తాను ఎంతో అభిమానించే క్రికెటర్‌ నుంచి తనకు గిఫ్ట్‌ అందిందని ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు. 









View this post on Instagram









A post shared by Abijeet (@abijeet11)







 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM