పూజా కార్యక్రమాలతో ప్రభాస్ 'సలార్' షురూ

by సూర్య | Fri, Jan 15, 2021, 01:35 PM

స్టార్ హీరో ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం సలార్‌. ఈ మూవీ పూజా కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో హోంబలే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత విజయ్ కిరగండూర్, కేజీఎఫ్ ఫేం యశ్, ప్రభాస్ తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన హోంబలే ఫిలిమ్స్ విజయ్‌ కిరగండూర్, ప్రభాస్ సార్ కు ధన్యవాదాలు. ఈ రోజు మాతో ఉన్నందుకు నా రాకీ (యశ్‌)కు ధన్యవాదాలు. సలార్ మిమ్మల్ని నిరాశపర్చదు. మాకు మీ ప్రేమ, మద్దతు అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు.


ప్రస్తుతం రాధేశ్యామ్ తోపాటు సలార్, ఆదిపురుష్ చిత్రాలతో నటిస్తున్నాడు ప్రభాస్‌. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం సలార్. సలార్ జనవరి చివరి వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దిశాపటానీని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశమున్నట్టు తెలుస్తున్నా..అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM