'విరాటపర్వం' నుంచి మరో పోస్టర్

by సూర్య | Wed, Jan 13, 2021, 03:34 PM

మావోయిస్టు ఉద్యమం నేపథ్యంలో.. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'విరాటపర్వం'. రానా మావోయిస్టుగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. గతంలో రానా జన్మదినం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసిన విషయం విదితమే. ఇప్పుడు సంక్రాంతి పర్వదినం సందర్భంగా నేడు మరో పోస్టర్ ను యూనిట్ విడుదల చేసింది. మావోయిస్టు యూనిఫామ్ లో వున్న రానా చేయిని పట్టుకున్న సాయిపల్లవి.. ఇద్దరూ ఆనందంతో నవ్వుతూ.. నడుచుకుంటూ వస్తున్న ఫొటోతో కూడిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రం థియేటర్లకు వస్తున్నట్టుగా అందులో ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM