ట్విట్టర్ సాయంతో 'మాస్టర్' దొంగను పట్టేశారు!

by సూర్య | Wed, Jan 13, 2021, 01:09 PM

తమిళ స్టార్ హీరో ‘దళపతి’ విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే, విడుదలకు ఒక్కరోజు ముందు ఈ సినిమా నిన్న ఇంటర్నెట్‌లో లీక్ కావడం చిత్ర యూనిట్‌తో పాటు విజయ్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. సుమారు 45 నిమిషాల ఫుటేజ్‌ను అక్రమంగా ఆన్‌లైన్‌లో పెట్టేశారు. ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతోన్న ‘మాస్టర్’ ఫుటేజ్‌ను దయచేసి ఎవ్వరూ షేర్ చేయొద్దని చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ నిన్న రాత్రి సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశారు. కాగా, ఈ ఫుటేజ్‌ను ఎవరు లీక్ చేశారు అనే విషయంపై నిన్నటి నుంచే చిత్ర యూనిట్ విచారణ మొదలుపెట్టింది.
వాస్తవానికి ‘మాస్టర్’ కాపీని విదేశాలకు ట్రాన్స్‌ఫర్ చేయడానికి చెన్నైలోని ఒక డిజిటల్ కంపెనీకి ఇచ్చారు. అక్కడి నుంచే ఈ ఫుటేజ్ లీకైంది. ఆ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి మాస్టర్ సినిమాను కాపీ చేసినట్టు ‘చెన్నై టైమ్స్’ పేర్కొంది. అతని ద్వారానే ఇంటర్నెట్‌లో లీకైనట్టు గుర్తించారట. ఆ దొంగను గుర్తించడంలో ట్విట్టర్ సహాయపడిందని అంటున్నారు. ఫుటేజ్‌ను లీక్ చేసిన వ్యక్తిని గుర్తించిన ‘మాస్టర్’ యూనిట్.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే, ‘మాస్టర్’ టీమ్‌కు అండగా యావత్తు సౌత్ సినిమా ఇండస్ట్రీ నిలిచింది. ‘మాస్టర్’ టీమ్‌కు అండగా ఉండాలని వివిధ సినిమా ఇండస్ట్రీలకు చెందిన స్టార్లు, ఫ్యాన్స్ అందరినీ రిక్వెస్ట్ చేశారు. #WeStandWithMaster అనే హ్యాష్‌ట్యాగ్‌తో వరుస ట్వీట్లు చేశారు.

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM