పండటి పాపాయికి జన్మనిచ్చిన ‘అనుష్కశర్మ’

by సూర్య | Tue, Jan 12, 2021, 08:36 AM

బాలీవుడ్ బ్యూటీ  అనుష్కశర్మ పండంటి పాపాయికి జన్మనిచ్చింది.  ఆస్ట్రేలియా సిరీస్ ను వదులుకొని మరీ భార్య అనుష్క శర్మ డెలివరీకి వచ్చిన విరాట్ కోహ్లీకి ఎట్టకేలకు ఆ గుడ్ న్యూస్ అందింది. విరాట్ భార్య అనుష్క  పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే విరాట్ కోహ్లీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం తమకు కుమార్తె పుట్టిందని.. పాప.. అనుష్క ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కోహ్లీ తెలిపారు. తమ జీవితాల్లో  సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంనందుకు తాము చాలా సంతోషిస్తున్నామని ఈ పరిస్థితుల్లో తమ ప్రైవసీని గౌరవించాలని కోహ్లీ కోరారు. సిడ్నీలో అద్భుత పోరాట ప్రతిభతో మూడో టెస్టును డ్రా చేసుకున్న రోజునే కోహ్లీ తండ్రి కావడం విశేషం. ఈ రోజు భారత మాజీ క్రికెట్ రాహుల్ ద్రావిడ్ పుట్టిన రోజు కావడం గమనార్హం. ఓవైపు ఇండియా పోరాడి గెలిచిన రోజునే కోహ్లీకి కూతురు పుట్టడంతో ఆ సంబరం రెట్టింపు అయ్యింది. రీసెంట్ గా తమ ప్రైవసీకి భంగం కలిగించదవద్దని ఓ ఫొటోగ్రాఫర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది అనుష్కశర్మ..మాకు ఓ పర్సనల్ లైఫ్ ఉంటుందని తెలిపింది. ఇప్పటికే తమ పర్సనల్ లైఫ్ కి భంగం కలిగించవద్దని ఇది పద్దతి కాదని హెచ్చరించింది కూడా. కాగా అనుష్కశర్మ..కోహ్లీలకి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM