టాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు

by సూర్య | Mon, Jan 11, 2021, 12:02 PM

భారతీయ సినీపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం ఓ దుమారం రేపింది. ఇప్పటికీ రేపుతూనే ఉంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ గా ఛాన్సులు ఇప్పిస్తామంటూ దర్శకులు, నిర్మాతలు, హీరోలు లైంగిక వేధింపులకు గురి చేసినట్లు పలువురు మహిళా నటులు ఆరోపించారు. ఇప్పటి వరకు సాధారణంగా హీరోయిన్స్ కి మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం చూశాం. కానీ తాజాగా తొలిసారిగా ఓ టాలీవుడ్‌ హీరో కూడా ఇలా లైంగిక వేధింపులు ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆ టాలీవుడ్ హీరో ఎవరో కాదు.. అడివి శేష్. ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విషయాలను వెల్లడించారు. 'క్షణం' సినిమా సక్సెస్ తర్వాత తనకు బాలీవుడ్ సినిమాల్లో అవకాశాల కోసం ముంబై వెళ్లినట్టు చెప్పుకొచ్చారు. అక్కడ ఛాన్సుల కోసం కొంత మంది దర్శక, నిర్మాతలను కలిసినట్టు చెప్పుకొచ్చారు. ఆ సందర్భంలో కొంతమంది తనను కమిట్మెంట్ అడిగినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినీ ఇండస్ట్రీలో సాధారణంగా మహిళలకు మాత్రమే లైంగిక వేధింపులు ఉంటాయని అనుకుంటారు. కానీ మగవాళ్లకు కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉంటాయని అపుడే తనకు తెలిసిందన్నాడు. అయితే చాలా మంది మేల్ ఆర్టిస్టులు ఇలాంటివి బయటపెట్టరని చెప్పుకొచ్చాడు. అడవిశేష్ చేసిన సంచలన ఆరోపణలపై పలువురు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. సెటైర్లు వేస్తున్నారు.

Latest News
 
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM