గౌతమ్ కార్తీక్ కి జోడీగా ‘సంయుక్త’

by సూర్య | Mon, Jan 11, 2021, 09:59 AM

హీరో గౌతమ్ కార్తీక్ కి జోడీగా నటించనుంది  బిగ్ బాస్ ఫేమ్ మరియు మోడల్ సంయుక్త. ఈ సినిమాకు బద్రి వెంకటేష్ డైరెక్టర్. కాగా ఇదే సినిమాలో మరో నటి శ్రీదివ్య కూడా నటిస్తున్నట్టు సమాచారం. అయితే విజయ్ సేతుపతి తుగ్లక్ దర్బార్ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందిన సంయుక్త బిగ్ బాస్ ద్వారా కూడా తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇప్పుడు తమిళనాట వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది. కాగా అటు ఇదే సినిమాలో నటించనున్న శ్రీదివ్య కూడా తాను 2017 లో నటించిన చిత్రం ‘సాంగిలి బుంగిలి కధవ తోరే’ తర్వాత కోలీవుడ్‌కు తిరిగి రావడానికి ఇదే మంచి అవకాశంగా భావించి ఈ సినిమాను ఒకే చేసినట్టు తమిళ మీడియా టాక్. ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్ స్థానిక ట్రిప్లికేన్ కుర్రాడిగా నటించనున్నారు. శ్రీ దివ్య ఈ చిత్రంలో ఉత్తర మద్రాసులో ఫిజియోథెరపీ క్లినిక్ నడిపే పాత్రలో కనిపించనుంది. వీరితో పాటు ఈ చిత్రంలో బాలా శరవణన్, ఎంఎస్ భాస్కర్ వంటి నటీనటులు కూడా నటిస్తున్నారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM