నటి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్..!

by సూర్య | Sun, Jan 10, 2021, 12:20 PM

సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తమ సినిమా విషయాలతో పాటు పర్సనల్ విషయాలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ నెటిజన్స్‌కు మంచి కాలక్షేపాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు హ్యాకర్స్ సెలబ్రిటీల అకౌంట్స్‌ని హ్యాక్ చేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.తాజాగా బాలీవుడ్ నటి ఇషా డియోల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు. దీంతో వెంటనే తన ఫాలోవర్స్‌కు ఇషా హెచ్చరికలు జారీ చేసింది. నా ప్రొఫైల్ నుండి ఎలాంటి మెసేజ్‌లు, పోస్ట్‌లు వచ్చిన స్పందించొద్దు అని స్పష్టం చేసింది. అంతేకాక తన ట్విట్టర్‌లో పలు స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేసింది. ఇటీవలి కాలంలో ఆషా బోస్లే, ఊర్మిళ మటోడ్కర్, సుషానే ఖాన్, విక్రాంత్ మస్సే, ఫరా ఖాన్ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా హ్యాక్ అయిన విషయం తెలిసిందే.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM