మూడేళ్లు చుక్కలు చూపించాడు: చాందిని చౌదరి

by సూర్య | Sat, Jan 09, 2021, 03:35 PM

ప్రతీ రంగంలో మంచి చెడులు సహజంగానే ఉంటాయి. ముఖ్యంగా గ్లామర్‌, క్రేజ్‌కు కేరాఫ్ అయిన సినీ రంగంలో అయితే మరీను. కొంత మంది సినిమాల్లో ఛాన్స్ పేరుతో అమాయకులను మోసం చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. అలా మోసపోయినవారిలో తాను ఒకరినని అంటుంది హీరోయిన్ చాందిని చౌదరి. కలర్‌ఫొటో సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తొలుత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. కెరీర్ ప్రారంభంలో చాందిని చౌదరిని ఓ నిర్మాత చాలా ఇబ్బంది పెట్టినట్లు వాపోయింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చాందిని ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. తనను సినిమాలో ఛాన్స్ పేరుతో ఓ నిర్మాత మూడేళ్లపాటు చుక్కలు చూపించాడని వాపోయింది. మూవీకి సంబంధించి అగ్రిమెంట్ పై సంతకం పెట్టడంతో అతడు చెప్పినట్లు చేయాల్సి వచ్చిందని వాపోయింది. మరో సినిమా చేసుకుంటానని చాందిని చౌదరి బ్రతిమిలాడినా ఆ నిర్మాత ఒప్పుకునేవాడు కాదని తెలిపింది. దీనిపై చాలా గొడవలే అయినట్లు తెలిపింది. చివరకు ఇక చేసేదేం లేక మూడేళ్ల వరకు చాలా ఇబ్బందులు పడ్డానని, వచ్చిన అవకాశాలు వదులుకున్నానని చెప్పుకొచ్చింది హీరోయిన్ చాందిని చౌదరి.

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM