రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఆనంది

by సూర్య | Fri, Jan 08, 2021, 05:13 PM

టాలీవుడ్ లో పలు సినిమాల్లో మెప్పించిన హీరోయిన్ ఆనంది. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కి షిఫ్ట్ అయిన ఈ అమ్మడు ఆ తర్వాత బిజీగా మారిపోయింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న తరుణంలో ఆమె సడన్ గా పెళ్లి పీటలెక్కేసింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘జాంబిరెడ్డి’ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించింది. ఇటు తెలుగులో అటు తమిళంలోనూ నటిస్తున్న ఆనంది సడన్ గా పెళ్లిచేసుకుంది. వరంగల్ లో ఈ హీరోయిన్ పెళ్లి సీక్రెట్ గా జరిగింది. సోక్రటీస్ అనే వ్యక్తిని ఆనంది వివాహమాడారు.
అతికొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో సోక్రటీస్, ఆనందిల వివాహం జరిగింది. సోక్రటీస్‌ తమిళ ఇండస్ట్రీలో దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాడని సమాచారం. ఇదిలావుంటే.. ఆనంది తెలుగులో ఈరోజుల్లో, బస్ట్ స్టాప్, నాయక్, ప్రియతమా నీవచటకుశలమా, గ్రీన్ సిగ్నల్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తమిళ్‌లో బిజీ అయ్యింది. ఇక తాజాగా ఆమె నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ 'జాంబి రెడ్డి' రిలీజ్‌కి సిద్దంగా ఉంది. అయితే కెరీర్ మంచి పొజిషన్‌లో ఉండగానే ఆనంది ఇంత సడన్‌గా పెళ్లి చేసుకోవడంపై టాలీవుడ్ వర్గాలు అనేక విధాలుగా చర్చించుకుంటున్నారు.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM