టైటానిక్ మూవీ చూడాలంటేనే అసహ్యం..హీరోయిన్ కేట్ విన్స్ లెట్

by సూర్య | Fri, Jan 08, 2021, 04:42 PM

టైటానిక్ మూవీ అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. ప్రపంచాన్ని నాడు ఉర్రూతలూగించిన ఈ మూవీ ఇప్పటికీ ఎప్పటికీ హిట్ సినిమాగానే మిగిలిపోతుంది. ఈ సినిమాపై అంతా ఆసక్తి చూపుతూ ఉంటారు. అందుకే 'టైటానిక్' సినిమాని చూడని వారు ఉండకపోవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే అప్పట్లో టైటానిక్ మూవీ ఒక అద్బుతమైన రొమాంటిక్ క్లాసికల్ మూవీ. సన్సేషనల్ సృష్టించింది. టైటానిక్ షిప్ మునిగిపోతున్న సమయంలో హీరో, హీరోయిన్ల మధ్య రోమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కేట్ విన్స్ లెట్ కు మంచి పేరు వచ్చింది.
ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. అయితే ఈ సినిమాపై కేట్ కీలక వ్యాఖ్యలు చేసింది. టైటానిక్ తనకు అసలు ఇష్టం ఉండదని వాపోయింది. ఆ సినిమా చూడాలంటేనే అసహ్యం అని ఆమె అంటోంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాకు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కామెరూన్ తెరకెక్కిస్తున్న 'అవతార్' సీక్వెల్ లో కేట్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM