కరోనా సోకిందన్న ప్రచారంపై నటి రేణు దేశాయ్ క్లారిటీ..

by సూర్య | Fri, Jan 08, 2021, 04:09 PM

కరోనా సోకిందంటూ వస్తున్న వార్తలపై సినీనటి రేణుదేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కరోనా సోకలేదని చెప్పుకొచ్చారు. ఓ వెబ్ సైట్ తనకు కరోనా సోకినట్టుగా ప్రకటిందని ఇది సరికాదన్నారు. తన ప్రమేయం లేకుండానే తనకు కరోనా సోకిందని తాను ప్రకటించినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనా నిర్ధారణ అయిన సమయంలో కొన్ని రోజులు షూటింగ్‌లకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందని.. ప్రస్తుతం ఇంటికి పరిమితం అయినట్టుగా తాను చెప్పినట్లు ప్రచారం చేసిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా తనకు కరోనా నెగిటివ్ వచ్చిన రిపోర్ట్స్‌ని షేర్ చేస్తూ ఆ వెబ్ సైట్‌ని ఏకిపారేశారు.
‘ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్.. దయచేసి ఇలాంటి తప్పుడు కథనాలను ప్రసారం చేసే స్టుపిడ్ వెబ్ సైట్స్‌ని ఫాలో కావడం వాళ్ల వార్తల్ని నమ్మడం మానేయాలని కోరుతున్నా. ఈ వెబ్ సైట్ ట్విట్టర్ ఖాతాలో కూడా తప్పుడు కథనాలే వస్తున్నాయి. ఈ స్టుపిడ్ వెబ్ సైట్ అబద్ధాలు, తప్పుడు వార్తలతోనే మనుగడ సాగిస్తున్నారు. సెలబ్రిటీలు ధృవీకరించబడిన ఖాతాలను మాత్రమే నమ్మండి. దయచేసి ఇలాంటి అన్ ఫెయిర్ స్టుపిడిటీ వార్తల్ని నమ్మొద్దు. అభిమానులకు ఏదైనా విషయాన్ని తెలియజేయడానికి సెలబ్రిటీలందరికీ అఫీషియల్ ఖాతాలు ఉన్నాయి. వాటి ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ఇలాంటి స్టుపిడ్స్ వెబ్ సైట్స్.. సెలబ్రిటీల గురించి అబద్ధాలు చెప్పి.. తప్పుడు కథనాలను ప్రసారం చేయడం ద్వారా ఫాలోవర్స్‌ని పెంచుకుంటారు. నిజాయితీగా పనిచేయరు. దయచేసి ఈ వెబ్ సైట్‌ని ఫాలో కావద్దు.. తప్పుడు వార్తల్ని చూస్తూ వాళ్లకి మరింత వ్యాపారాన్ని ఇవ్వొద్దు’ అంటూ ఆ వెబ్ సైట్‌పై ఫైర్ అయ్యారు రేణూ దేశాయ్.

Latest News
 
'పోటెల్' టీజర్ రిలీజ్ Fri, Apr 19, 2024, 03:20 PM
'లవ్ మౌళి' నార్త్ అమెరికా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 03:18 PM
'భీమా' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు Fri, Apr 19, 2024, 03:03 PM
నేడు స్మాల్ స్క్రీన్ పై మెరవనున్న 'మంగళవరం' Fri, Apr 19, 2024, 03:00 PM
'కృష్ణమ్మ' లోని థీమ్ అఫ్ వెంగెర్న్స్ లిరికల్ సాంగ్ అవుట్ Fri, Apr 19, 2024, 02:57 PM