by సూర్య | Fri, Jan 08, 2021, 02:15 PM
బ్రిటీషన్ నటి బనితా సంధుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 'కవితా తెరెసా' షూటింగ్ కోసం వచ్చిన ఆమెకు కరోనా సోకింది. సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు ఆమె గత నెల 20న కోల్ కతాకు చేరుకుంది. అదే విమానంలో వచ్చిన ఓ వ్యక్తికి కరోనా కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో విమానంలో వచ్చిన వారందరికీ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో హీరోయిన్ బనితా సంధుకి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే అది కొత్తరకం వైరస్ స్ట్రెయినా లేక కరోనా అన్న దానిపై తేలాల్సి ఉంది.
దీంతో ఆమెను బెలియాఘటలో ఏర్పాటు చేసిన ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆస్పత్రికి తరలించాలని అధికారులు నిర్ణయించారు. వారందరినీ అంబులెన్స్ ఎక్కించి పంపించారు. తీరా ఆస్పత్రికి వెళ్లిన తర్వాత వాహనం దిగేందుకు బనితా నిరాకరించింది. తాను ఆస్పత్రికి వెళ్లనంటూ మెుండికేసింది. అంతేకాదు అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అంబులెన్స్ చుట్టూ కవచంలా నిలిచారు. ఆమెను నిలువరించారు. ఆపై ఓ ప్రైవేటు ఆసుపత్రికి బనితాను పంపారు.