భార్య‌తో క‌లిసి బ‌ర్త్‌డే వేడుక‌లు జ‌రుపుకున్న య‌ష్‌

by సూర్య | Fri, Jan 08, 2021, 11:52 AM

కేజీఎఫ్ సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్‌. ఇతని అస‌లు పేరు నవీన్ కుమార్ గౌడ. జనవరి 8, 1986 న కర్ణాటకలో జన్మించిన య‌ష్ రాకింగ్ స్టార్‌గా అభిమానుల మ‌న‌సులు గెలుచుకున్నారు. ఇక  2016 లో తన మొదటి సినిమా హీరోయిన్ రాధిక పండిట్‌‌ను పెళ్లిచేసుకోగా, వీరికి ఇద్ద‌రు సంతానం.  ఐరా అనే కూతురు,  యథ‌ర్వ్‌ అనే కొడుకు ఉన్నారు. కూతురు ఐరా 2018 డిసెంబర్‌లో జన్మించగా.. 2019 అక్టోబర్‌లో ఈ జంట యథ‌ర్వ్ కు జన్మనిచ్చింది.


ఈ రోజు య‌ష్ త‌న 35వ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ్యామిలీతో క‌లిసి సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్నాడు. శ్రీమ‌తితో క‌లిసి కేక్ క‌ట్ చేయ‌గా, ఇందుకు సంబంధించిన ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. య‌ష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన కేజీఎఫ్ 2 టీజ‌ర్ రికార్డులు సృష్టిస్తుంది. త‌క్కువ స‌మ‌యంలో మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్ రాబ‌డుతూ రికార్డులు కొల్ల‌గొడుతుంది.  కాగా, కర్ణాటకలోని హసన్ జిల్లాలోని ఒక చిన్న పట్టణంలో జ‌న్మించాడు య‌ష్‌. అతని తండ్రి కెఎస్ ఆర్టిసి రవాణా సేవలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు.  

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM