కేజీఎఫ్ 2 టీజర్ విడుదల

by సూర్య | Fri, Jan 08, 2021, 09:49 AM

కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కేజీఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సీక్వెల్‌.. ఈ ఏడాది క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న చిత్ర టీజర్‌ను విడుదల చేస్తానన్న మేకర్స్.. ఒక రోజు ముందుగానే నెట్టింట్లో లీక్ కావడంతో.. కొద్దిసేపటి క్రితమే దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్ర టీజర్‌ను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ అపియరెన్స్, అధీరాగా సంజయ్ దత్ ఎంట్రీ,.. ఫైటింగ్ సీన్స్..చివర్లో యష్ విధ్వంసం.. ఒకటేమిటీ.. మొత్తం టీజర్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ఇస్తుంది.   బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండెన్‌తో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో అన్ని ఇండస్ట్రీల్లోనూ కేజీఎఫ్ 2పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.   ఈ మూవీ జూలై 30న కేజీఎఫ్2 ను రిలీజ్ కానుంది


 


 


 





Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM