ఆ సినిమాను వదులుకున్న కాజల్..

by సూర్య | Thu, Jan 07, 2021, 03:36 PM

గతంలో దర్శకుడు తేజ రూపొందించిన 'లక్ష్మీకల్యాణం' చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైన కథానాయిక కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా వెలుగొంది.. ప్రముఖ హీరోల అందరి సరసన నటించి, అగ్రతారగా రాణించింది. అటు తమిళంలో కూడా పలు సినిమాలు చేసి అక్కడ కూడా సక్సెస్ అయింది. ఇటీవలే వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలు కమిట్ అయినప్పటికీ, తాజాగా తేజ సినిమాను వదులుకున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు తేజ 'అలివేలుమంగ వెంకట రమణ' అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మొదట్లో అలివేలుమంగ క్యారెక్టర్ కి కాజల్ ని ఎంచుకున్నట్టు, చేయడానికి ఆమె కూడా ఒప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, తాజాగా ఆమె వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రాజక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె స్థానంలో కథానాయిక తాప్సిని తీసుకున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM