నాగబాబుపై నెటిజన్స్ ఫైర్

by సూర్య | Thu, Jan 07, 2021, 02:34 PM

మాములుగా నాగబాబు తనకు సంబంధించిన విషయాలతో పాటు బర్త్ డే విషెస్‌ను కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా తెలుపుతుంటాడు. అందులో భాగంగా ఆయన తాజాగా.. నిన్న (జనవరి 6) ఏఆర్ రెహ్మాన్ బర్త్ డే సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. నిన్న క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ బర్త్ డే కూడా అని తెలిసిందే. దీంతో నాగబాబు కపిల్ దేవ్‌కు కూడా నాగబాబు బర్త్ డే విషెస్ తెలిపాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ కపిల్ దేవ్ ఫోటోను షేర్ చేయాల్సింది పోయి ఓ సినీ హీరో ఫోటోను షేర్ చేసి పప్పులో కాలేశాడు. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ 83 పేరుతో వస్తోన్న ఓ సినిమా పోస్టర్‌ను నాగబాబు షేర్ చేశాడు. కపిల్ దేవ్ బయోపిక్‌గా వస్తోన్న 83 సినిమాలో రణ్ వీర్ సింగ్ లుక్‌ను షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పాడు నాగబాబు. దీంతో నెటిజన్స్ ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. ఇదంతా గమనించిన నాగబాబు అరే.. పొరపాటు జరిగిందే అని.. కాసేపటి తరువాత పోస్ట్ డిలీట్ చేసాడు. అయితే అప్పటికే జరగాల్సిన రచ్చ జరిగిపోయింది.

Latest News
 
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM