హీట్ పెంచుతున్న స‌మంత

by సూర్య | Thu, Jan 07, 2021, 01:54 PM

చెన్నై చిన్న‌ది స‌మంత నాగ చైత‌న్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా మారింది. పెళ్ళి త‌ర్వాత ఈ ముద్దుగుమ్మ సైలెంట్ అవుతుందేమోన‌ని అంద‌రు భావించ‌గా, వారి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ రెచ్చిపోతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఓటీటీలే కాకుండా హాట్ హాట్‌గా ఫొటో షూట్ చేస్తూ త‌న అభిమానుల‌కి మ‌స్త్ మ‌జాని అందిస్తుంది. ఈ మ‌ధ్య హాట్ ఫొటోస్‌తో హీట్ పెంచుతున్న స‌మంత తాజాగా మ‌రో హాట్ ఫొటో షేర్ చేసింది. 


‌బ్లాక్ కలర్ టాప్, గోల్డ్ కలర్ ప్యాంట్ ధ‌రించి మ‌త్తెక్కించే క‌ళ్ళ‌తో చూస్తున్న స‌మంత ఫొటో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటో త‌క్కువ‌ స‌మ‌యంలోనే  16 లక్షల లైకులను దక్కించుకుంది.ఇక త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వ‌ర్క‌వుట్‌కు సంబంధించి కూడా ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో స‌మంత చేస్తున్న ఆస‌నాలు నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. త‌ను ఇంత ఫిట్‌గా ఉండ‌డానికి కార‌ణం ఇలాంటి ఆస‌నాలే అయి ఉంటాయ‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. స‌మంత ప్ర‌స్తుతం ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌తో పాటు శాకుంత‌లం అనే చిత్రం చేస్తుంది. 


కాగా స‌మంత సాకి పేరుతో వ‌స్త్ర దుకాణం న‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా స‌మంత‌నే వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, ఈ బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ కోసం స‌మంత ఇలా ద‌ర్శ‌న‌మిస్తుంద‌ని టాక్.



 


 


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM