వివాదంలో చిక్కుకున్న సోనూసూద్

by సూర్య | Thu, Jan 07, 2021, 12:43 PM

ప్రముఖ సినీ నటుడు సోను సూద్‌ వివాదంలో చిక్కుకున్నారు. బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC) ఆయనపై పోలీస్ కేసు పెట్టింది. జుహూ ప్రాంతలో ఉన్న తన ఆరంతస్తుల భవాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా హోటల్‌గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు జుహూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర రీజియన్ అండ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్‌‌ నిబంధనలను ఉల్లంఘించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. ఐతే బీఎంసీ ఆరోపణలను సోను సూద్ ఖండించారు. నివాస భవనాన్ని హోటల్‌గా మార్చేందుకు బీఎంసీ నుంచి 'చేంజ్ ఆఫ్ యూజర్' అనుమతులు తీసుకున్నానని స్పష్టం చేశారు. తాను ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని సోను సూద్ స్పష్టం చేశారు.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM