సత్యదేవ్‌తో జతకట్టనున్న పాయల్‌ రాజ్‌పుత్

by సూర్య | Tue, Jan 05, 2021, 02:33 PM

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్‌ మొదలుపెట్టి ‘జ్యోతి లక్ష్మి’ సినిమాతో హీరోగా మారాడు సత్యదేవ్‌. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఈ యంగ్‌ హీరో ‘బ్లఫ్‌ మాస్టర్‌’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. ఈ సినిమాలో సత్యదేవ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో సత్య తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు.


ఇదిలా ఉంటే ఈ యంగ్‌ హీరో తాజాగా మరో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ‘బ్లఫ్‌ మాస్టర్‌’తో తనకు విజయాన్ని అందించిన గోపీ గణేశ్‌ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటించాడు. ‘గాడ్సే’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటి పాయల్‌ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటన చేయనుందని సమాచారం. ఇక ఆర్‌ఎక్స్‌100తో తెలుగు కుర్రకారును ఫిదా చేసిన ఈ బ్యూటీ అనంతరం ఆ స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. మరి సత్యదేవ్‌ అయినా పాయల్‌కు విజయాన్ని అందిస్తాడో లేదో చూడాలి.

Latest News
 
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM