రెండో పెళ్లి చేసుకున్న దర్శకేంద్రుడి మాజీ కోడలు..

by సూర్య | Tue, Jan 05, 2021, 02:12 PM

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మాజీ కోడలు రెండో పెళ్లి చేసుకుంది. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెల మూడి గతంలో ప్రముఖ స్క్రీన్ రైటర్ కనికా ధిల్లాన్‌ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు వీరి దాంపత్యం సజావుగా సాగిన మధ్యలో వచ్చిన మనస్పర్ధల రావడం తో ఇరువురు విడాకులు తీసుకున్నారు.


దీంతో కనికా ఇప్పుడు రెండో పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయ్యింది. బాలీవుడ్ స్క్రీన్ రైటర్ హిమాన్షు శర్మను వివాహం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొని నూతన వధూవరులని ఆశీర్వదించారు. వివాహానికి సంబంధించిన ఫొటోలను కనికా థిల్లాన్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కొత్త సంవత్సరంలో కొత్త ప్రయాణం అని కామెంట్ పెట్టింది. కనికా థిల్లాన్‌, హిమాన్షుశర్మ గత సంవత్సరం డేటింగ్ ప్రారంభించారు. అంతే కాకుండా వారిపై వస్తున్న వార్తల్ని నిజం చేస్తూ గత ఏడాది జూన్‌లో తమ సంబంధం గురించి ప్రకటించారు. ఇక వీరిద్దరి ప్రస్తుత ప్రాజెక్టుల విషయానికి వస్తే..హిమాన్షు.. అక్షయ్ కుమార్, అత్రాంగీ రేచిత్రాలతో బిజీగా ఉన్నాడు. కనికా.. తాప్సీ హసీన్ దిల్‌రూబా, రాజ్‌కుమార్ హిరానీ తదుపరి చిత్రంలకు పని చేస్తుంది.

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM