కిసాన్ గా రాబోతున్న సోనూసూద్

by సూర్య | Tue, Jan 05, 2021, 02:09 PM

రియల్ హీరో సోనూసూద్ 'కిసాన్' అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో ప్రకటించారు. ఈ సినిమాను రాజ్ శాండిల్యా నిర్మిస్తున్నాడు. నివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా సోనూసూద్ కొత్త సినిమాకు అమితాబ్ బచ్చన్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సోనూ స్పందిస్తూ.. అమితాబ్ బచ్చన్ ‏కు కృతకజ్ఞతలు తెలియజేశారు. లాక్‏డౌన్ సమయంలో పేద కార్మికులకు సాయం చేసిన సోనూసూద్.. ప్రజల్లో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇన్ని రోజులు నెగెటివ్, విలన్ పాత్రల్లో నటించిన సోనూసూద్ ఇప్పుడు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM