తెలంగాణ పోలీస్ ప్రచారకర్తగా నందమూరి ఎన్టీఆర్

by సూర్య | Tue, Jan 05, 2021, 11:09 AM

ఫేస్‌బుక్ ప్రేమల బారినపడి మోసపోవద్దంటూ టాలీవుడ్ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ అవగాహన కల్పిస్తున్నాడు. ఫేస్‌బుక్‌ను వాడుకుంటూ మోసాలకు పాల్పడే ముఠాలు చాలానే ఉన్నాయని, వాటి బారినపడొద్దంటూ తెలంగాణ పోలీసులు రూపొందించిన వీడియోను ఎన్టీఆర్ ప్రమోట్ చేశాడు. ఈ ముఠాలు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పేరుతో అమ్మాయిల్ని బుట్టలో వేసుకుని, ఫోన్ నంబరు తీసుకుంటాయని, ఆపై ప్రేమ పేరుతో వల విసురుతాయని పోలీసులు ఆ వీడియోలో చూపించారు. కాస్తంత దగ్గరైన తర్వాత వాట్సాప్‌లో అభ్యంతరకర ఫొటోలను తెప్పించుకుంటాయని, అనంతరం రంగంలోకి దిగుతాయని పేర్కొన్నారు. ఆ ఫొటోలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారని, ఇవ్వకుంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తారని వివరించారు. కాబట్టి  ఇలాంటి ఫేస్‌బుక్ పరిచయాలు, ప్రేమలకు దూరంగా ఉండాలని సూచిస్తూ పోలీసులు ఈ వీడియోను రూపొందించారు. ఈ వీడియోను ప్రమోట్ చేసిన ఎన్టీఆర్.. ‘‘చెల్లెమ్మా నా మాట విను.. ఫేస్‌బుక్ మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త’’ అని హెచ్చరించాడు. మోసగాళ్ల బారినపడి ఎవరైనా బాధితులుగా మారితే ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు.


 


 

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM