‘క్రాక్’ నుండి మాస్ బిర్యాని సాంగ్

by సూర్య | Tue, Jan 05, 2021, 08:28 AM

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం క్రాక్. ఈ మూవీలో హీరోయిన్ శృతిహాసన్. ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్రం నుంచి మాస్ బిర్యానీ సాంగ్ లిరికల్ వీడియోను ఈ చిత్ర మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఆ సాంగ్ ఎలా ఉందో తెలుసా ఓసి నా క్లాస్ క‌ల్యాణి…పెట్ట‌వే మాస్ బిర్యాని అంటూ సాగే ఈ పాట ఊర మాస్ స్టెప్పుల‌తో దుమ్మురేపుతోంది. ర‌వితేజ‌-శృతిహాస‌న్ కాంబినేష‌న్ మ‌రోసారి థియేట‌ర్ల‌లో ర‌చ్చ చేస్తుంద‌ని ఈ పాట చూస్తే తెలిసిపోతుంది. కాస‌ర్ల శ్యామ్ రాసిన ఈ పాట‌ను రాహుల్ నంబియార్, సాహితి చాగంటి పాడారు. ర‌వితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం క్రాక్. ‘క్రాక్’ మూవీ జనవరి 9 నుంచి థియేటర్స్ లో సందడి చేయనుంది.

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM