పవర్ స్టార్ సరసన నటించేది ఐశ్వర్య రాజేశ్ ?

by సూర్య | Mon, Jan 04, 2021, 05:02 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత సినీరంగంలోకి ప్రవేశించారు. ఇన్నేళ్ల తర్వాత వస్తున్న పవన్ సినిమాలపై ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా పవర్ స్టార్ ఒకవైపు రాజకీయాల్లో రాణిస్తూనే మరో వైపు సినీ రంగంలో దూసుకుపోతున్నారు. అటు ఇటు చూసుకుంటూ రెండింటిలో బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళుతున్నారు ఈ హీరో. అయితే మూడేళ్ల పాటు సినిమాలకు ఇచ్చిన గ్యాప్ ను ఈ ఇయర్ క్లియర్ చేయడానికి పూనుకున్నాడు . భారీ బడ్జెట్ తో వస్తున్న ఎన్నో ప్రాజెక్టులలో యాక్టీవ్ గా పాల్గొంటున్నారు. వీలైనన్ని సినిమాలను తీయడానికి పూనుకున్నాడు పవన్. దీంతో పవన్ అభినులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో పింక్ రీమేక్ సినిమా 'వకీల్ సాబ్' షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.


ఈ మూవీ కూడా దాదాపుగా చివరి దశకు వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ కూడా మొదలైంది. ఈ మూవీ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఎన్నో అంచనాలతో తెరముందుకు రాబోతోంది. ఈ సినిమాల తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను, అలాగే హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పీరియాడికల్ నేపథ్యంలో ఉండబోతుందనేది తెలిసిన విషయమే. కాగా ఈ మూవీలో పవన్ బందిపోటు తరహా పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు గుప్పుమన్నాయి.


 


అయితే ఈ మూవీ గురించి తాజాగా వచ్చిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన నటించేది ఐశ్వర్య రాజేశ్ అంటూ వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ గిరిజన యువతిగా కనిపించనుందట. ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ ను ఎప్పుడూ చేయలేదు. కావున ఈ పాత్రలో ఈ ముద్దుగుమ్మ ఎంత సక్సెస్ అవుతుందో తెలియనిది. కాగా ఈ వార్త ఎంత వరకు వాస్తవమనేది ఆ సినిమా యూనిట్ ప్రకటించేదాకా వేచి చూడాలి. అలాగే ఈ ముద్దుగుమ్మ 'అయ్యప్పనుమ్ కోషియం' సినిమాలో కూడా నటిస్తుందనే వార్తలు షికార్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై డైరెక్టర్ క్రిష్ కూడా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. దాంతో ఈ వార్తలు నిజమేనని పవన్ అభిమానులు భావిస్తున్నారు. అయితే క్రిష్ ఇటీవలె కరోనా బారిన పడ్డారు. దాంతో ఈ సినిమా మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశమైదే ఉందనిపిస్తుంది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM