ఫిదా బ్యూటీకి మరో పెద్ద ఆఫర్‌..!

by సూర్య | Mon, Jan 04, 2021, 02:03 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గతేడాది వరుస రికార్డులు సాధించాడు. అంతేకాకుండా గతేడాది అలా వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం స్టార్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడినా సినిమా విజయ పథంలో నడుస్తోంది. ఇటీవల ఆగిన షూటింగ్ మళ్లీ నిలిచిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు కాస్త కుదుట పడటంతో ఈ నెల 8నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సారి పక్కా షెడ్యూల్ రెడీ చేసి త్వరగా సినిమాను పూర్తి చేయాలని చిత్ర టీం చూస్తోంది. అయితే ఈ సినిమాలో అల్లుఅర్జున్‌కి చెల్లెలి పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ కనిపించనుందట, అది కూడా ఎవరూ కాదండీ నాచురల్ బ్యూటీ సాయిపల్లవి. అయితే ఈ అమ్మడుకి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో రాంచరణ్‌కి జోడీ పాత్ర ఆఫర్ వచ్చిందట. కానీ ఈ బ్యూటీ ఆ ఆఫర్‌ని రెజెక్ట్ చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ఫలో చేయడం ఏంటని కొందరు అంటున్నారు. మరి కొందరు పుష్ప సినిమా కోసమే ఆచార్య ఆఫర్‌కి నో చెప్పిందని అనుకుంటున్నారు.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM