చీకటి గదిలో చితక్కొట్టుడు’కి సీక్వెల్

by సూర్య | Mon, Jan 04, 2021, 12:10 PM

ఒక సినిమాకి సీక్వెల్ తీయడం మామూలే. అదే తరహాలో తెలుగు..తమిళ భాషల్లో హిట్ అయిన అడల్ట్ హారర్ కామెడీ చిత్రం చీకటి గదిలో చితక్కొట్టుడుకి సీక్వెల్ రానుంది.  మొదటి వెర్షన్‌కు దర్శకత్వం వహించిన సంతోష్. పి. జయకుమారే.. ఈ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించారు. అంతేకాదు ఆయన ఇందులో హీరోగా కూడా చేయడం విశేషం. ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని జనవరి 7వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత ఎస్. హ‌రి భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా.. ”ఇప్పటివరకు వచ్చిన అడల్ట్ హారర్ కామెడీ చిత్రాలకి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. మొదటి వెర్షన్ కి మించిన స్థాయిలో ఈ సీక్వెల్ ఉంటుంది. లాక్‌డౌన్ తరువాత దీపావళికి తమిళనాట విడుదలైన తొలి చిత్రం ఇదే. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. కొత్త సంవత్సరంలో ప్రేక్షకులకి కనువిందు చేసే చిత్రం ఇది” అని తెలిపారు ఈ చిత్ర దర్శకుడు, హీరో సంతోష్. పి. జయకుమార్.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM